
కార్యనిర్వాహక చైర్మన్
కార్యనిర్వాహక ఛైర్మన్
గౌరవనీయులు
శ్రీ జస్టిస్ పి. సామ్ కోషి
గౌరవనీయులైన శ్రీ జస్టిస్ పి. సామ్ కోశి
న్యాయమూర్తి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు
ఎగ్జిక్యూటివ్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ
1967 ఏప్రిల్ 30న జన్మించారు. 1987లో వాణిజ్యంలో బ్యాచిలర్ డిగ్రీ, 1990లో లా డిగ్రీ పొందారు. మార్చి 9, 1991న న్యాయవాదిగా చేరారు. మొదట జబల్పూర్లోని మధ్యప్రదేశ్ హైకోర్టులో 2000 అక్టోబర్ వరకు, ఆ తర్వాత 2000 నవంబర్ నుండి 2013 సెప్టెంబర్ వరకు బిలాస్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో పౌర, రాజ్యాంగ, సేవా మరియు కార్మిక అంశాలపై ప్రాక్టీస్ చేశారు. 2002 నుండి 2004 వరకు ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2005-06లో డిప్యూటీ అడ్వకేట్ జనరల్‌గా కూడా పనిచేశారు. గతంలో రాయ్‌పూర్‌లోని హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం రాయ్‌పూర్‌లోని హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ జనరల్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులతో పాటు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, కోల్ ఇండియా లిమిటెడ్, సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, మధ్యప్రదేశ్ విద్యుత్ బోర్డు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు మొదలైన అనేక ప్రైవేట్ సంస్థలకు న్యాయవాదిగా పనిచేశారు. సెప్టెంబర్ 16, 2013న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తరువాత, 08.03.2016న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు బదిలీ అయిన తర్వాత, ఆయన 27.07.2023న తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన 27.07.2023 నుండి 25.03.20.24 వరకు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
01.07.2025 నుండి తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా మరల బాధ్యతలు స్వీకరించారు.