పరిచయం
“న్యాయం అందరికీ అందుబాటులో ఉండేలా” చూసుకోవడానికి సమ్మిళిత న్యాయ వ్యవస్థను ప్రోత్సహించడం.
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ యొక్క కీలకమైన విధులు:-
- ఉచిత మరియు సమర్థవంతమైన న్యాయ సహాయ సేవలను అందించడం.
- సమాజంలోని బలహీన వర్గాలకు చట్టపరమైన అవగాహనను వ్యాప్తి చేయడం మరియు సాధికారతను కల్పించడం.
- ముఖ్యంగా లోక్ అదాలత్ మరియు మధ్యవర్తిత్వం ద్వారా సత్వర మరియు చవకైన ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం.
ఎవరికి ఉచిత మరియు సమర్థవంతమైన న్యాయ సహాయం అందించబడుతుంది?
- మహిళలు మరియు పిల్లలు
- షెడ్యూల్డ్ కులాల లేదా
- షెడ్యూల్డ్ తెగలు సభ్యులు
- పారిశ్రామిక కార్మికులు
- వికలాంగులు
- నిర్బంధంలో ఉన్న వ్యక్తులు
- మానవ అక్రమ రవాణా బాధితులు
- ప్రకృతి వైపరీత్యాల బాధితులు
- జాతి/కుల హింస, పారిశ్రామిక విపత్తుల బాధితులు
- వార్షిక ఆదాయం రూ. 3,00,000/- కంటే తక్కువ ఉన్న వ్యక్తులు లేదా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫై చేసిన వ్యక్తులు
ఎక్కడికి వెళ్ళాలి?
- సివిల్, క్రిమినల్ మరియు రెవెన్యూ కోర్టులు, ట్రిబ్యునళ్ళు, న్యాయ లేదా పాక్షిక-న్యాయ విధులను నిర్వర్తించే ఏదైనా అధికారం.
- ఉచిత న్యాయ సహాయ సేవలను అందించే అన్ని సంస్థలలో
- జాతీయ న్యాయ సేవాధికార సంస్థ
- సుప్రీంకోర్టు న్యాయ సేవాాధికార కమిటీ
- రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలు
- హైకోర్టు న్యాయ సేవాాధికార కమిటీలు
- జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు
- మండల న్యాయ సేవాాధికార కమిటీలు
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (టి.ఎస్.ఎల్.ఎస్.ఎ.).
సంప్రదించవలసిన చిరునామా :
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, 1వ & 2వ అంతస్తు, న్యాయ సేవా సదన్, హైకోర్టు ప్రాంగణం, హైదరాబాద్-500066.
ఇ-మెయిల్ : telenganaslsa[at]gmail[dot]com
టోల్ ఫ్రీ నంబర్: – 15100